మన న్యూస్ సింగరాయకొండ:-

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా ఈ నెల 20న (శుక్రవారం) సింగరాయకొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో కీర్తి మెడికల్స్, పేటీఎం, డెలివరీ డాట్ కాం, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్, స్నైడర్ ఎలక్ట్రిక్, ఎస్బీఐ కార్డ్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.పదవ తరగతి నుండి పీ.జీ చదువుకున్న 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జే. రవితేజ యాదవ్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000 నుండి రూ.25,000 వరకు జీతం అందనుంది. మరిన్ని వివరాలకు 96522 82636 నంబర్‌ను సంప్రదించవచ్చు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *