• వ్యవసాయ అధికారి పి గాంధీ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- పత్తి సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా జగ్గంపేట,గౌరంపేట గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ప్రత్తి వేసే పొలాన్ని బాగా దుక్కి చేసి కలుపు, దుబ్బులు లేకుండా చూసి వరుసలో విత్తనాలు నాటుకోవాలని,రైతులందరూ ఒకేసారి నాటుకోవడం వల్ల పత్తిలో గులాబీ రంగు పురుగు ఉదృతి నుండి పంటను కాపాడ వచ్చని వివరించారు.అధిక సాంద్రత పద్దతిలో పత్తి నాటడం వల్ల గులాబీ రంగు ఉదృతి తగ్గడమే కాక నేలలో సేంద్రీయ కార్బన్ శాతం పెరుగుతుందని తెలిపారు. పత్తి పొలం చుట్టూ నాన్ బీటీ పత్తి విత్తనాలు వేయడం ద్వారా చీడ పీడల ఉధృతిని తగ్గించ వచ్చని వివరించారు.అనంతరం మామిడి,అరటి తోటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇచ్చారు. ఏ ఈ ఓ శ్రీనివాస్, మౌళి ప్రసాద్, వ్యవసాయ,ఉద్యాన సహాయకులు క్రాంతి,సువర్ణరాజు,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *