మఖ్తల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చారిత్రాత్మకం- స్థానిక ఎమ్మెల్యే రాకతో ఏడాదిన్నరకే మఖ్తల్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి..- ఎమ్మెల్యే శ్రీహరి మానస పుత్రికల్లో డయాలసిస్ సెంటర్ ఒకటి,

మన న్యూస్ మక్తల్ నియోజకవర్గం: మక్తల్ నియోజవర్గ వాసులకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్ సెంటర్ పూర్తిస్థాయి సౌకర్యాలతో అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చిందని,ఇక మీదట మక్తల్ నియోజకవర్గం ప్రజలు డయాలసిస్ సేవల కోసం నారాయణపేట & మహబూబ్ నగర్ కు వెళ్లాల్సిన అవసరం లేదని పూర్తిగా మక్తల్ ప్రభుత్వాసుపత్రి పరిధిలోని డయాలసిస్ సెంటర్ లో సేవలను ఉచితంగా అందుకోవచ్చని ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం డయాలసిస్ సెంటర్లో అయిదు పడకల సామర్థ్యంతో పేషెంట్లకు డయాలసిస్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… గత జనవరిలో వైద్యారోగ్య శాఖామంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా డయాలసిస్ సెంటర్ ను దాదాపు కోటి నలభై లక్షల రూపాయలతో ప్రారంభించుకున్నామని, అయితే కొన్ని సౌకర్యాలు అందుబాటులో లేక కాస్త ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సౌకర్యాలు కల్పించి పూర్తిస్థాయిలో డయాలసిస్ సెంటర్ సేవలను ప్రారంభించుకున్నామని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేశాయని, గత 10ఏళ్లుగా మఖ్తల్ లో డయాలసిస్ సెంటర్ ప్రారంభించాలని ఎందుకు గత పాలకులకు ఆలోచన రాలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్ సేవలు ప్రారంభమయ్యాయని,రాష్ట్రంలో మొత్తం 119 నియోజవర్గాలుంటే 100కు పైగానే నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్ సేవలు అందుబాటులోకి రాగా మక్తల్ నియోజవర్గంలో మాత్రం డయాలసిస్ సెంటర్ ను గత పాలకులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలు గతంలో నారాయణపేట లేదా మహబూబ్నగర్ కు వెళ్లాలంటే వందకు పైగా కిలోమీటర్లు ప్రయాణించి వ్యయా ప్రయాసలకోర్చి డయాలసిస్ సేవల కోసం చాలా ఇబ్బందులు పడేవారని అన్నారు. ఇక మీదట మక్తల్ లోనే డయాలసిస్ సెంటర్ సేవలు ప్రారంభంతో.. ప్రజల ఇబ్బందులు తొలగించామన్నారు.డయాలసిస్ సెంటర్ నిర్వహణ కోసం దాదాపు నెలకు 5 నుంచి 6 లక్షల వరకు వ్యయం అవుతుందని.. ఏడాదికి కనీసం 60 లక్షల రూపాయలు డయాలసిస్ సెంటర్ నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఇప్పటికే మఖ్తల్ లో 150 పడకల ఆసుపత్రి పనులను ప్రారంభించుకున్నామని .. అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వైద్య ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డయాలసిస్ సెంటర్ సిబ్బందిని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమం లో మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ రవి కుమార్, నేతలు చంద్రకాంత్ గౌడ్, కోళ్ళ వెంకటేష్, మాగనూరు మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, శివరాం రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్ ,శాలంబిన్ ఉమర్, నేతలు వల్లంపల్లి లక్ష్మణ్, కావలి తాయప్ప, గాయత్రి అనిల్, కట్ట వెంకటేష్, బోయ వెంకటేష్, మందుల నరేందర్, వాకిటి హనుమంతు, నాగేష్, కావాలి రాజేందర్, నాగరాజ్, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవికుమార్, వాకిటి నాగరాజు, బోయ నరసింహ, సురేష్ ,నాగేందర్ , అబ్దుల్ రెహమాన్ , మెకానిక్ రాము ,రహీం పటేల్, రాఘవరెడ్డి, శంషాద్దీన్ భూత్పూర్ చెన్నయ్య గౌడ్ , పొర్ల నరసింహ, మిస్కిన్ నాగరాజ్, మహమ్మద్ నయుం,గద్వాల రవి ,మొగులప్ప , కృష్ణమూర్తి , అక్కల రాకేష్ ,గార్లపల్లి అశోక్ గౌడ్ ,హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ వినుత , మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ , సివిల్ ఆస్పత్రి జూనియర్ అసిస్టెంట్ యాదగిరి ,డయాలసిస్ సెంటర్ ఆపరేటర్స్ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 4 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…