

చోరీ మొబైల్ ఫోన్లు కొనడం, అమ్మడం నేరం- మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ www.ceir.gov.in వెబ్ పోర్టల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి.- – మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి.
మన న్యూస్ నారాయణపేట జిల్లా: మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్ తెలిపారు. బుధవారం రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గత రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 91 మంది బాధితుల మొబైల్ పోన్లను కనిపెట్టి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నూతన టెక్నాలజీ ఆధారంగా నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం 91 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది వాటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను బాధితులకు బుధవారం రోజు అప్పగించడం జరిగింది. మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ పోలీసు అధికారులకు తెలిపారు. ప్రజలు ఎవరు పాత మొబైల్ ఫోన్ల ను కొనరాదు అని, చోరీ అయిన మొబైల్ ఫోన్లను కొనడం అమ్మడం నేరమని ఎస్పి తెలిపారు. మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. మొత్తం 91 ఫోన్ లను నూతన టెక్నాలజీ సాయంతో ఐటి కోర్ పోలీసులు ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది.అందుకు ఐటి కోర్ టీమ్ ను ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్ హక్, ఎస్సై లు సునీత, రమేష్, నరేష్ , పోలీసు సిబ్బంది, మొబైల్ తీసుకున్న వారు, తదితరులు పాల్గొన్నారు.
