

మన న్యూస్ నర్వ మండలం: మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం ఉందెకోడ్ గ్రామం లో రైతు వేదికలో అమాలిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి మొదటి వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డా.వాకిటి శ్రీహరి.అనంతరం ఎమ్మెల్యే వాకిటి మాట్లాడుతూ ఈ దేశంలో రైతు పండించే పంటను తనకు తానుగా ఏనాడైతే ధరను నిర్ణయిస్తాడో అప్పుడే రైతు బాగుపడినట్లు అని,రైతు ఉన్నతి కోసం బాగు కోసం నేను రైతులకు ఎప్పుడైనా, ఎప్పటికైనా, ఎంత వరకైనా వారి తోడుగా ఉంటానని అన్నారు.ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థం తో రైతుల బాగు కోసం ఏర్పడి పనిచేస్తున్న ఉందెకోడ్ అమాలిక రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కంపెనీ వారికి నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ అధికారి జాన్ సుధాకర్,తహసీల్దార్ మల్లారెడ్డి,ఎంపిడిఓ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏవో అఖిల రెడ్డి,పి ఏ సి ఎస్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి అధికారులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శరణప్ప, శ్రీనివాస్ రెడ్డి, వివేకవర్దన్ రెడ్డి, బీసం రవి సాగర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు బద్దిపల్లి రాజారెడ్డి,యూత్ కాంగ్రెస్ పార్టీ అశోక్ గౌడ్, అంజనేయ రెడ్డి, ఉందెకోడ్ గ్రామ పార్టీ అధ్యక్షులు కొండన్న ,నాగప్ప,ఉందెకోడ్ ,పాతర్చేడ్,జంగం రెడ్డిపల్లి, రాజ్ పల్లి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
