

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 13జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాలలోని చింతలపేటకు చెందిన బషీర్ అనే వ్యక్తి మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచరం మేరకు గద్వాల టౌన్ ఎస్ ఐ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రయదారుడుని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి.680గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ సుమారు రూ. 27వేలు ఉంటుందన్నారు. గత సంవత్సరం నుంచి హైదరాబాద్ దూల్ పేట, సోలాపూర్ నుంచి కొనుగోలు చేసిన గంజాయిని గద్వాలలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తు తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఎస్ఐ తరుణ్ కుమార్‌రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.
