విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు – ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కి టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ వినతి

పూతలపట్టు, మన న్యూస్, మే 9:పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన తవనంపల్లి, బంగారుపాలెం, ఐరాల, యాదమరి, పూతలపట్టు మండలాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు ఏకంగా 7 నుండి 8 సార్లు విద్యుత్ అంతరాయం జరుగుతోందని, దీని వల్ల రైతులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా మోటర్లు, స్టార్టర్లు, విద్యుత్ కేబుల్స్ వంటి ఉపకరణాలు నష్టపోతున్నాయని విన్నవించారు.ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ రావు ని ఆయన కోరారు. ప్రజల జీవన ప్రమాణాన్ని కాపాడేందుకు, వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత అవసరమని స్పష్టం చేశారు.విద్యుత్ శాఖ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Related Posts

వాడవాడల అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యురు గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామి సత్యమును గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసి మూడు రోజులపాటు విశేష పూజలు అందించారు. మూడవరోజు స్వామివారి మేళ…

వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..