జలదంకి,ఫిబ్రవరి12, మన న్యూస్,(నాగరాజు కె ).
జలదంకి మండలం లోని రాబోయే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి ఉత్సవాల పాంప్లెట్లను కార్యక్రమ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.భక్తుల భారీ రద్దని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు..శివరాత్రి సందర్భంగా స్వామి వారి ఊరేగింపు.అభిషేకాలు,,రుద్ర పట్టణాలు,,అన్నదాన కార్యక్రమాలు,, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దేవస్థానం కమిటీ స్పష్టం చేశారు.ఈసారి శివరాత్రిని మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఇది మన గ్రామానికి ఆధ్యాత్మిక పండుగ ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
