పూతలపట్టు, మన న్యూస్, మే 9:పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన తవనంపల్లి, బంగారుపాలెం, ఐరాల, యాదమరి, పూతలపట్టు మండలాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు ఏకంగా 7 నుండి 8 సార్లు విద్యుత్ అంతరాయం జరుగుతోందని, దీని వల్ల రైతులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా మోటర్లు, స్టార్టర్లు, విద్యుత్ కేబుల్స్ వంటి ఉపకరణాలు నష్టపోతున్నాయని విన్నవించారు.ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ రావు ని ఆయన కోరారు. ప్రజల జీవన ప్రమాణాన్ని కాపాడేందుకు, వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత అవసరమని స్పష్టం చేశారు.విద్యుత్ శాఖ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.