

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరిగిన తెలుగు నాటకరంగ దినోత్సవ కార్యక్రమంలో శంఖవరం ఏ.పి. మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన “బాలల అక్రమ రవాణా” నాటిక ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ నాటిక సమాజంలో ప్రధానమైన సమస్యగా నిలిచిన “బాలల అక్రమ రవాణా”ను ఇతివృత్తంగా తీసుకొని, అత్యంత ప్రభావవంతంగా ప్రదర్శించారు. ఈ నాటికకు దర్శకత్వం చేసిన ఇంగ్లీషు ఉపాధ్యాయురాలు మిట్టపల్లి సౌమ్య కళాత్మకతకు ప్రతీకగా నిలిచారు. వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా, సమాజంపై లోతైన ఆలోచనలు రేకెత్తించేలా చేశారు.
జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఉపాధ్యాయురాలు మిట్టపల్లి సౌమ్య కి మరియు విద్యార్థులను సత్కరించి, వారి ప్రతిభను గౌరవించారు. ఈ సందర్భంగా, శంఖవరం మండలం విద్యాశాఖాధికారి -1 ఎస్.వి. రమణ విద్యార్థులు సామాజిక స్పృహ పెంపొందించడం మరియు కళాత్మక ప్రతిభకు నూటికి నూరు మార్కులు సాధించిన ఈ ప్రదర్శన అందరికీ స్ఫూర్తిదాయకం” అని కొనియాడారు. విద్యార్థులు చూపిన ప్రతిభకు, ఉపాధ్యాయుల మార్గదర్శకతకు మండల విద్యాశాఖ అధికారి-2 గోవింద్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పేరెంట్ టీచర్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి ఉపాధ్యాయురాలు మరియు విద్యార్థులను ప్రశంసించారు. ప్రధానాచార్యులు వై.ఎస్.వి. కిరణ్ మాట్లాడుతూ, “మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయురాలు మిట్టపల్లి సౌమ్య కి ప్రతిభకు గొప్ప గౌరవం లభించింది. ఈ అద్భుత ప్రదర్శనతో మా పాఠశాల ప్రతిష్ఠ మరింత పెరిగింది,” అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రెసిడెంట్ దంటు భాస్కర రావు కి, జనరల్ సెక్రెటరీ శ్రీ పివి రావు కి, సెక్రటరీ శ్రీ ప్రభుదాసు కి, నాట్యాచార్య రమణ కి మరియు క్లబ్ ప్రముఖులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.