

శంఖవరం మన న్యూస్ (అపురూప్) సమగ్ర శిక్ష మరియు కాకినాడ జిల్లా జిసిడిఓ ఉమా మహేశ్వరి ఆధ్వర్యంలో కెరీర్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సెలర్లు జిల్లాలోని అన్ని కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో పదవతరగతి పరీక్షలు రాసి, ఫలితాలకోసం నిరీక్షిస్తున్న విద్యార్ధులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కాకినాడ జిల్లా ,ప్రత్తిపాడు మండలం,శంఖవరం కేజీబీవీ లో విద్యార్థినిలకు కాకినాడ జిల్లా రిసోర్సు పర్సన్, కెరీర్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సెలర్ కుసుమ మాట్లాడుతూ, పరీక్షలే జీవితం కాదనీ,జీవితం ఎంతో విలువైనది, అందమైనదనీ పరీక్షలు – ఫలితాలు, గెలుపు – ఓటములు చిన్న చిన్న మజిలీలు మాత్రమే అని అవగాహన కలిగించి ,వారి భవిష్యత్ ప్రణాళికలకు ప్రేరణ కలిగించారు. ఈ సదస్సులో భాగంగాపిల్లలతో తో రోల్ ప్లే చేయిస్తూ ,విద్యార్థులకు కొన్ని సమస్యా పరిష్కార నైపుణ్యాలు,ఆత్మవిశ్వాసం తో లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం ,ధైర్యంగా జీవిత సవాళ్ళను ఎదుర్కోవటం,భావోద్వేగ నియంత్రణ వంటి విషయాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో శంఖవరం కేజీబీవీ ప్రిన్సిపల్ బి .బాలమణి మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.