

శంఖవరం మన న్యూస్ (అపురూప్): లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోక పాప పరిహారార్థము శిలువ మీద పొందిన పవిత్ర మరణాన్ని స్మరించుకుంటూ కత్తిపూడి గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్ సి ఎం రెవ.ఫాదర్.చిటికల రాజకుమార్ ఆధ్వర్యంలో కత్తిపూడి పురవీధుల గుండా యేసు సిలువ 14 స్థలాల స్మరణ చేసుకుంటూ భక్తి యుతంగా ఉపవాస ప్రార్ధనలతో ఆలయంలో సిలువముద్దు, సిలువ ఆరాధన, క్రీస్తు శ్రమల చరిత్రను స్మరించుకున్నారు. దీనిలో సంఘ సభ్యులు, పెద్దలు , పిల్లలు అనేకమంది భక్తి విశ్వాసాలతో పాల్గొన్నారు.