

మన న్యూస్ కలిగిరి:: అభాగ్యులకు అభన్న హస్తం అందిస్తూ సమాజ సేవలో విధులు నిర్వహిస్తూ, ప్రజాసేవలో నేను సైతం అంటూ ఉన్నదాంట్లో ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం చేస్తూ ఆపద్బాంధవుడులా నిలుస్తున్నాడు ఓ రిపోర్టర్ ఆయనే పకీర్ జి.
వివరాలలోనికి వెళితే కలిగిరి మండలానికి చెందిన జి పకీర్ ఆర్థికంగా బూడిదలుకులు ఎదుర్కొని ఆర్థిక స్థిరత్వం కొంత పొంది కష్టాల్లో ఉన్నవారికి తమ వంతుగా కొంత ఆర్థిక సహాయం అందించాలని సమాజ సేవలో పరితపించాలని దానికి ఒక వేదిక కావాలని ఆర్ టి వి రిపోర్టర్ గా సమాజానికి పరిచయమయ్యారు. పేదలంటే ఆయనకు మమకారం. అన్యాయం జరిగితే ఓర్చుకొని గుణం, అభాగ్యులకు ఆపద కలిగిందంటే కరిగిపోయే మనస్తత్వం, ఉన్నదాంట్లో పేదవారికి అభాగ్యులకు ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం అందజేసి ఆ ఆనందంలో తరిస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో అభాగ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం వింజమూరు పంచాయతీ పరిధిలోని జీవీకేఆర్ ఎస్టి కాలనీకి చెందిన ఒక యువకుడు విద్యుత్ షాక్ కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సుమారు 75% ఒళ్ళు కాలిపోయింది. వైద్యం ఖర్చులకు డబ్బులు లేక మంచానికే పరిమితమై బాధను అనుభవిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్ టి వి రిపోర్టర్ వారి నివాసానికి వెళ్లి అతని భార్యకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ఇది తెలిసిన సీనియర్ సిటిజనుల సైతం శభాష్ విలేకరన్న అంటున్నారు.