

మన న్యూస్ సింగరాయకొండ:-
జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన భారతీయ పౌరులకు సంతాపం తెలియజేస్తూ మృతులకు జనసేన పార్టీ పక్షాన సంతాప కార్యక్రమం కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది.
25-04-2025
శుక్రవారం రోజు సాయంత్రం 4:30 నిమిషాలకు సింగరాయకొండ మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం. మరియు 5:00 గంటలకు మానవహారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనయులు జనసేన పార్టీ నాయకులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొని సంతాపాన్ని తెలియజేస్తారు.
కొండపి నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరమహిళలు ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము.
కనపర్తి మనోజ్ కుమార్
(జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త)
ఐనాబత్తిన రాజేష్
(సింగరాయకొండ మండల అధ్యక్షులు)