మన న్యూస్, తిరుపతి : ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఎ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు, హక్కులు ఏమి ఉన్నాయని తెలిపిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలిపారు. భారతదేశంలో అణగారిన కులాల సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారిని పేర్కొన్నారు. అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం, దురహంకారం పై గొంతిత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వర్ణించారు. న్యాయశాఖ మంత్రిగా సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలను రూపొందించడంలో అంబేద్కర్ గారి పాత్ర మరువలేనిది అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చేసిన పోరాటాలు అనన్య సామాన్యమని తెలిపారు.భారతదేశ సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను గౌరవించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీ, కృష్ణ వంశీ, వేణు,సషయ్యద్ బాషా, నవీన్, సునీల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *