జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసనసభ సభ్యులు పాశం సునీల్ కుమార్

మనన్యూస్,గూడూరు:జనసేన,చిరంజీవి యువత నాయకులు నయీమ్ ఆధ్వర్యంలో పేద ముస్లిమ్స్ కు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గూడూరు షాది మంజిల్ లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు శాసనసభ సభ్యులు పాశం సునీల్ కుమార్ తో జనసేన,తెలుగుదేశం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మాట్లాడుతూ…….. గూడూరు నియోజకవర్గం లోని మారుమూల తీర ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి జనసైనికులు నిస్వార్ధంగా ఒక పైసా ఆశించకుండా సేనాని మాటలపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు…ఆ విషయం మరిచిపోనని తెలిపారు.
అనేక పదవుల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపి మాకు ధైర్యం నింపి కూటమి ప్రభుత్వం గెలిపించడానికి కారణం అయ్యారు సునిల్ తెలిపారు.
అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కిషోర్ గునుకుల మాట్లాడుతూ… భారతీయులందరూ సోదర సోదరీమణులు ఎవరికి కావాల్సిన మతం కులం అనుభవించే స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగి ఉన్నారు. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ పలుమార్లు ఉచ్చరిస్తారు. కొంతమంది మతోన్మాద శక్తులు మాత్రమే వాటిని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు ఎలక్షన్ల ముందే గెలుస్తాయని ఊహించిన స్థానాల్లో గూడూరు పాశం సునీల్ అన్న ఒకరు.దేశం మొత్తం కూడా హిందూ ముస్లిం సోదరులు ఒకే ఇంటి పండుగ వల్లే జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులకు అందరికి కూడా రంజాన్ పవిత్ర మాస శుభాకాంక్షలు.రంజాన్ పండుగ క్రమశిక్షణకు సేవా గుణానికి మారుపేరు కఠినమైన నియమాలతో నిరాహార దీక్షలు చేస్తూ పేదవారికి సహాయం చేస్తూ రంజాన్ సారాంశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముస్లిం సోదరులందరికీ కోరికలు ఫలించాలి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది ముందుకు తీసుకెళ్లటం లో సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను.
గూడూరు సంబంధించిన కొంతమంది నన్ను పని అడుగుగ రికమండేషన్ అవసరం లేదు ఎవరు ఏం చేశారు అన్నకి బాగా తెలుసు మీరే అడగండి అని తెలుపగా… వారే వారి అవసరతను కనుక్కొని వారికి న్యాయం చేయడం జరిగింది.
పోరాటయోధుడు నయీం ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేసుకొని జనసేన పార్టీ సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్లారు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు