

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క బడంగ్పేట్ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మదన గోపాల స్వామి మాట్లాడుతూ బడంగ్పేట్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా తాము ఇక్కడ బ్రాంచ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ బ్యాంకు చిరు వ్యాపారులకు వారి అవసరమును బట్టి పదివేల నుండి 50వేల రూపాయల వరకు రుణాలను మంజూరు చేస్తుందని తెలిపారు. పరిశ్రమలకు,పారిశ్రామిక అభివృద్ధికి 5 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయగలమని తెలిపారు. ఈ బ్యాంకు యొక్క మొదటి బ్రాంచ్ ను 1998లో జీడిమెట్ల షాపూర్ నగర్ లో పారిశ్రామిక అభివృద్ధి సముదాయమునకు దగ్గర్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను స్థాపించిన ఈ 27 సంవత్సరాలలో బడంగ్పేట్ బ్రాంచ్ ను 34వ బ్రాంచ్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వినియోగదారులు సేవలు వినియోగించుకోవచ్చని బ్యాంకు తెరిచి ఉంచబడునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మదన గోపాల స్వామి,డిజీఎం అయ్యప్ప నాయుడు,,ఏజీఎం కామినేని శ్రీనివాస రావు బ్రాంచ్ మేనేజర్ బ్రహ్మయ్య,గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బండారి మనోహర్, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
