

Mana News, చిత్తూరు :- చిత్తూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముఖానికి మాస్కులు ధరించి, కత్తులు, రాడ్లు చేబూని హిందీలో మాట్లాడుతూ నలుగురు దొంగలు సంచరించడం కలకలం రేపింది. దుర్గానగర్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి చోరీకి యత్నించగా స్థానికులు, సదరు కుటుంబం వారు మేల్కొని కేకలు వేశారు. ఆపై స్థానికుల సమాచారంతో పోలీసులు రావడంతో వారు పారిపోయారు. కట్టమంచిలోనూ వారు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపున వారు తిరిగిన ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమై సీసీ ఫుటేజీ సేకరించి వీరిని దొంగల ముఠాగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. దొంగల ముఠా సంచారంతో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. నైట్‌బీట్లు పెంచడమే కాక రక్షక్, ప్యాట్రల్ వాహనాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు తమకు సహకరించాలని, ఊరెళ్లే వారు ఇళ్లకు తాళాలు వేసుకోవడమే కాక స్థానిక స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు.