

Mana News :- అమరావతి: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ఒకే వేదికపైకి రాబోతున్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచచరిత్ర పుస్తకావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఆ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా, ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. దగ్గుబాటి ఇటీవలే ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లి… పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానించారు. ప్రపంచచరిత్ర పుస్తకాన్ని తెలుగు, ఆంగ్లభాషల్లో ప్రచురించారు. తెలుగు పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఆంగ్ల పుస్తకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించనున్నారు. ఎంపీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి పుస్తకావిష్కరణ సభను నిర్వహించనున్నారు.