నిర్మాణ పనులకు సముద్రపు ఇసుక – వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లే

Mana News, Nellore :- కడలి తీరంలోని ఇసుక తువ్వ నిర్మాణాలకు పనికి రాదని.. వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లేనని హెచ్చరిస్తారు. పైపెచ్చు లవణీయ స్వభావంతో నిర్మాణాల మనుగడకే ప్రమాదమని చెబుతుంటారు. కావలి నియోజకవర్గంలోని కొందరు బడా వ్యక్తులకు ఇదేమీ పట్టడం లేదు. కాసుల యావతో వివిధ అభివృద్ధి పనులకు సముద్రపు ఇసుకనే తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కావలి మండలంలోని ఒట్టూరు, లక్ష్మీపురం గ్రామాల్లో పొక్లెయిన్లతో తవ్వి.. యథేచ్ఛగా టిప్పర్లలో తరలిస్తున్నారు. పనుల ఒప్పందాల్లో పెన్నా ఇసుకను వినియోగిస్తామని చెప్పి.. ఇలా చేయడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలలు తాకే చోట.. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండటంతో.. సముద్రం కోతకు గురయ్యే అవకాశం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దీనిపై కావలి ఆర్డీవో ఎం.సన్నీవంశీకృష్ణ వివరణ కోరగా.. సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక తువ్వను తవ్వి నిర్మాణాలకు తరలించడం తగదన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Related Posts

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు