ఆంధ్రులందరికీ ఆనందం తెచ్చే గొప్ప పండగ సంక్రాంతి:డాక్టర్ డి. సునీత

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి సునీత సంక్రాంతి పందగ గూర్చి విద్యార్దులకు వివరించారు సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారని .అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మనకు పన్నెండు రాశులు ఉన్నాయని .ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారని . అంధ్ర ప్రదెశ్ ,తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారని . ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారని మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుందని తెలియజేశారు. కళాశాలలో పండగ వాతావరణం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. సంక్రాంతి సందర్భంగా. విద్యార్థులంతా సాంప్రదాయక వస్త్రాలతో కళాశాల హాజరయ్యారు. భోగి మంటలు ఏర్పాటు చేసి పిండివంటలని. ఆరగిస్తూ. సంక్రాంతి గేయాలతో కళాశాల ప్రాంగణం అంతా ఊరోత్తించారు. రంగోలి, క్యాట్ వాక్ గాలిపటాలు పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు. బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే వెంకటేశ్వర రావు.ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రయాగ మూర్తి ప్రగడ అధ్యాపకులు శ్రీ వీరభద్రరావు శ్రీ కే సురేష్. శ్రీవిరామారావు. డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ మదీనా. శ్రీమతి పుష్ప. కుమారి మేరి రోజులిన.శ్రీ సతీష్ మరియు అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///