

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు,ప్రత్తిపాడు నియోజకవర్గం,ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన పులి వెంకటేష్,తోపాటి శ్రీనివాస్ ఇటీవల విద్యుత్ షాక్ కి గురై కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సీపి నాయకులు ముదునూరి కృష్ణంరాజు వారిని పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయలు నగదును ఆర్థిక సాయంగా అందించారు.ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ వైసిపి కార్యకర్తలు కష్టంలో ఉంటే ఎటువంటి సాయం చేయటానికి అయినా సరే, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లు నాగేశ్వరరావు,జువ్వల దొరబాబు,కోలా తాతబాబు, యాళ్ల ఏసు తదితరులు పాల్గొన్నారు.