

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్
మన న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 5:-జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల విషయమై మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మల్కాజిగిరి
బీజేపీ ఎంపీ.ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్(చార్మినార్) ఏరియాలోని ఖాజా షౌక్ మీటింగ్ హాల్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా, మోతిగల్లి, ఖిల్వత్ ఉర్దూ ముస్కాన్ సాలర్ ఈ మిల్లట్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగిన ఎన్యు జె(ఐ)కి అనుబంధంగా ఉన్న తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఏ)రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ…గతంలోనే తని జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల గురించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయినట్లు చెప్పారు. జర్నలిస్టులకు అందాల్సిన రాయితీలు అందేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలన్నారు. జర్నలిస్టులు వృత్తి పరంగా దృష్టిపెట్టి, కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సమాజం గురించి ఆలోచించే సమాజ సేవ చేసే సమాజంలో నాల్గవ స్తంభం అయిన జర్నలిస్టులు వారి వారి కుటుంబాలు బాగుండాలంటే, ప్రభుత్వాలు వారికి ఆ దించాల్సిన సహాయం అందించాలన్నారు.
జర్నలిజం కత్తిమీద సాము లాంటిదని, వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు వారి కష్టానికి ఫలితం లేకుండా పోతుందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో జర్నలిస్ట్ ల సంక్షేమం గురించి ప్రస్తావించాలని, జర్నలిస్ట్ ల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్య ఉన్న కూడా తన దృష్టికి వస్తే తన పరిధిలో సహాయాన్ని చేస్తానని హామీ ఇచ్చారు. పత్రికా విలేకరులకు స్వేచ్ఛగా వార్తలను రాసే విధంగా యాజమాన్యం ప్రోత్సహిస్తే సమస్యలను మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా కృషి చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సి దిలీప్ కుమార్, టీడీపీ రాష్ట్ర స్పోక్స్ మెన్, ఈ కార్యక్రమంలో టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు, టీజేఏ వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రాజేందర్ నాథ్, టీజేఏ ప్రతినిధులు, ఖాసీం, ఖాలీల్ అహ్మద్, గౌరీ, చింతల నీలకంఠంతో, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డితో పాటు రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల నుండి టీజేఏ సభ్యులు, జర్నలిస్టులుతదితరులు పాల్గొన్నారు.
.