

మన న్యూస్:గొల్లప్రోలు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవ తో కాలనీకి మహర్దశ,వివరాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.గొల్లప్రోలు శివారు జగన్ కాలనీకి వెళ్లే మార్గంలో సుద్ద గడ్డ కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను సాగునీటి పారుదలకు ఆటంకం లేకుండా చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.సుద్ద గడ్డ వరదల కారణంగా కాలనీకి వెళ్లే రహదారిపై తరచూ వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరదల సమయంలో స్వయంగా పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారం కోసం బ్రిడ్జి నిర్మిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.ఈ మేరకు పవన్ ఆదేశాలతో ఇటీవల బ్రిడ్జి నిర్మాణ పనులకు 4 కోట్ల రూపాయలను అధికారులు మంజూరు చేశారు.దీంతో గడచిన వారం రోజులుగా జగన్ కాలనీకి వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.కాలువలో చేపడుతున్న పనుల కారణంగా సుద్ద గడ్డ కాలువకు ఎగువ నుండి వస్తున్న నీరు దిగువకు వెళ్లకుండా నిలిచిపోవడంతో దాళ్వాకు నీరు అందదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.అలాగే కొత్త కలింగల్ కు బల్లలు వేసిన సమయంలో గోదావరి,ఏలేరు నీరు సుద్ద గడ్డ కాలువ ద్వారా పై ప్రాంతానికి ప్రవహించే అవకాశం ఉండదేమోనని రైతుల నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సుద్ద గడ్డ కాలువకు గోదావరి నుండి పైకి ఎగబొడిచి చే నీటితోనే ఏటా దాళ్వా,అపరాలు, కాయగూర పంటలు పండిస్తున్నామని రైతులు తెలిపారు.ఇప్పటి నుండి వర్షాలు పడే పరిస్థితి లేనందున సాగునీటికి పూర్తిగా కాలువల నీటిపైనే ఆధారపడవలసి వస్తుందన్నారు.మరికొద్ది రోజుల్లో వేసవి ప్రారంభమైతే సాగునీటికి మరింత ఇబ్బంది ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కాలువలో చేయబడుతున్న పనులు సాగునీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేపట్టాలని, సాగునీరు ఎగువ నుండి దిగువకు,అలాగే కొత్త కళింగల్ కు బల్లలు వేసినప్పుడు దిగువ నుండి ఎగువకు వచ్చే సాగునీటి ప్రవాహానికి అనువుగా తగినన్ని తూరలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను రైతులు కోరుతున్నారు.