స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలి త్వరలో పూడూరు గోదాముల కార్మికులతో సమావేశం

మనన్యూస్:గద్వాల జిల్లా గతంలో డబ్బులు వసూలు చేసి పని కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రతి కార్మికుని కి ఉపాధి కల్పించాలి గొంగళ్ళ రంజిత్ కుమార్డి గడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గులాంబ గద్వాల
గద్వాల మండలంలోని పూడూరు దగ్గర ఉన్న గోదాములలో పని కల్పిస్తామని పూడూరు, ఎర్రవల్లి,జమ్మిచేడు,మేలచెరువు,జంగంపల్లి,కొండపల్లి తదితర గ్రామాలలో సుమారు 600 మందికి పైగా 40 వేల నుండి లక్ష రూపాయల దాకా స్థానిక గోదాములు ప్రారంభమవుతే అందరికీ పని కల్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని, ప్రస్తుతం వీరికి కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వారికి ఉపాధి కల్పించారని అన్నారు. వెంటనే స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరారు.త్వరలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 600 మంది కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ఐక్యతతో ఉండేలా యూనియన్ ఏర్పాటు చేయాలని వారి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వారు పోరాడతారని అన్నారు అనేక రాజకీయ కుట్రలతో ఇన్ని సంవత్సరాలు గోదాములను నడవకుండా చేశారని ప్రస్తుతం అన్ని సమస్యలను పరిష్కారం చేసుకొని చట్టబద్ధంగా ప్రారంభమైన గోదామును కొంతమంది కుట్రతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని న్యాయపరంగా సక్రమంగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు,ప్రత్యక్షంగా,పరోక్షంగా రెండు వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అట్లాంటి గోదామును కేవలం రాజకీయ కుట్రతో అడ్డుకోవడం తగదని అన్నారు గతంలో స్థానిక గ్రామాలకు చెందిన కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఇక్కడ గోదాము వస్తే మాకు పని కలుగుతుందని ఆశతో డబ్బులు కట్టి 14 సంవత్సరాలు కావస్తున్న మాకు ఉపాధి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.త్వరలో కార్మికులతో పాటు రవాణా కు చెందిన అసోసియేషన్ వారితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరికి ఉపాధి కల్పించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని జిల్లాలోనె అత్యధికంగా ఉపాధి కల్పించే ఈ గోదాములను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులందరికి ఉంది అన్నారు,ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 1 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు