గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గట్టు మండల పరిధిలోని మాచర్ల , ఆలూరు , వాయల కుంట తండా గ్రామాలలో తాను బలపరిచిన సర్పంచి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే మా తరఫున బలపరిచిన అభ్యర్థులకు గెలిపించాలని కోరారు.ఆలూరు గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే నేను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి కోరారు.ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ
గ్రామాల అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచులు మనవాళ్లు గెలవాలి
గతంలో గట్టు మండలంలో గ్రామాలలో గతంలో నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రాంతంలోని ప్రజలు వివిధ ప్రాంతాలకు వలసలు గా వెళ్లేవారు ఇక్కడ కరువు కాటకాలకు నిలయంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే అభివృద్ధికి నోచుకోలేకపోయాయి అని పేర్కొన్నారు.
నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి గట్టు మండల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామాలలోని మౌలిక సదుపాయాలు సి.సి రోడ్లు డ్రైనేజీ నిర్మాణం మంచినీటి సౌకర్యం విద్యుత్ పాఠశాలలు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హిందువులకు దేవాలయం దగ్గర ముస్లింలకు మసీదుల దగ్గర క్రిస్టియన్ల కు చర్చి దగ్గర కమిటీ హాల్ లను నిర్మాణం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాని తో భాగస్వాములై గద్వాల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది ప్రభుత్వ అమలుపరిచిన సంక్షేమ పథకాలను ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన హామీల భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ గ్యాస్, సిలిండర్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఉచిత సన్న బియ్యం అందించడం జరిగింది. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అమలుపరిచే సంక్షేమ పథకాలను మహిళా సంఘాల ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ధార మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం మహిళలకు వివిధ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించారు. అదేవిధంగా మండలానికి బస్సు, పెట్రోల్ బంకు, సోలార్ విద్యుత్ కేంద్రం పాయింటును ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు.భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందించే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.మీ మీ గ్రామాలలో మేము బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటును నెల 11-11-2025 నాడు ఓటు వేసి వేయించి అత్యధికమైన భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.సర్పంచ్ అభ్యర్థులను గెలిపిద్దాం..గ్రామపంచాయతీ అభివృద్ధి వైపు నడిపిద్దాం.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ ఆనంద్ గౌడు, మాజీ సర్పంచ్ సిద్ధి రామప్ప, నాయకులు కురుమన్న, ఆలీ, సురేష్,శ్రీనివాస్ రెడ్డి, రాజ గౌడ్, తిమ్మప్ప, మేస్త్రీ తిమ్మప్ప, మహమూద్, ఆనంద్, నర్సింహులు, నాయకులు కార్యకర్తలు









