-నిర్లక్ష్య వైఖరితో విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు.
మన ధ్యాస, మక్తల్: సమాచార హక్కు చట్టం 2005 భారత దేశంలో అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రతి భారతీయ పౌరుడికి వజ్రాయుధం లాంటిది. ఈ చట్టాన్ని కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారు. నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామంలో ఓ గ్రామ పంచాయతీ అధికారి సహ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. సమాచార హక్కు చట్టం 2025 నోటీస్ బోర్డులో పంచాయతీ కార్యదర్శి పేరు ఫోన్ నెంబర్,సహాయ పౌర సమాచార అధికారి పేరు ఫోన్ నెంబర్ మరియు అప్పిలేట్ అధికారి పేరు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా నోటీస్ బోర్డులో మెన్షన్ చేయాలి అలా కాకుండా కొందరు అధికారులు ఆ చట్టం గురించి తెలవని కొందరు అధికారులు సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం పాలు చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. సంబధి తాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకొని చట్టపరంగా ప్రతి గ్రామపంచాయతీలో సమాచార హక్కు చట్టం బోర్డులను నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.