మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను మహమ్మద్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తహసీల్దార్ లత చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లయ్యగారి ఆకాశ్, సర్పంచులు బోయిని హరీణ్ కుమార్, కిరణ్, నాయకులు సాయిగౌడ్ ,జిపివో వినోద్ ,తదితరులు పాల్గొన్నారు.