*కోవూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ. మన ధ్యాస , కోవూరు,అక్టోబర్ 4:డ్రైవర్ల సేవలో పధకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 90 వేల 669 మంది డ్రైవర్లకు ఆర్ధిక సహాయం అందించి కూటమి ప్రభుత్వం పక్షపాతి అని ప్రక్షపాత ప్రభుత్వమని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించారన్నారు ఎపి ఆగ్రోస్ ఛైర్మెన్ మాలేపాటి సుబ్బా నాయుడు . ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో శనివారం కోవూరు కెవిఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరు గ్రామంలోని బజారు సెంటర్ నుంచి కెవిఎస్ కళ్యాణ మండపం వరకు ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. జై తెలుగుదేశం పార్తీ జై జై చంద్రబాబు నాయిడు, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నాయకత్వం అన్న నినాదాలతో ఆటో డ్రైవర్లు కోవూరు వీధుల్లో హోరెత్తించారు. అనంతరం పార్టీ ప్రతినిధిగా పాల్గొన్న ఎపి ఆగ్రోస్ ఛైర్మెన్ మాలేపాటి సుబ్బా నాయుడు మాట్లాడుతూ…… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల 90 వేల మంది ఆటో డ్రైవర్లకు 15 వేలు ఆర్థిక అందిస్తూ తలపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలలో పధకం ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం యిచ్చిన దసరా కానుకగా అభివర్ణించారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 260 కోట్లు ఖర్చు చేస్తే… కూటమి ప్రభుత్వం ఆటో సోదరులకు 435 కోట్లు ఆర్ధిక సహాయం అందించిందన్నారు.. అసంఘటిత రంగంలో ఉన్న ఆటో కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుటంబాల్లో ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కాలంటే భయపడాల్సిన పరిస్థి ఉండేదని గుంతల రోడ్లు, పోలీసుల కేసులతో ఆటో తిప్పాలంటేనే భయపడే పరిస్థితి వుండేదన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు10 వేలు మాత్రమే యిస్తే కూటమి ప్రభుత్వం 15 వేలు యిచ్చి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అందజేసే 15 వేల ఆర్థిక సహాయంతో డ్రైవర్లు తమ వాహనాల రిపేర్లు, మెయింటెనెన్స్, కుటుంబ అవసరాలు ఆసరాగా ఉంటుందన్నారు. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆటో సోదరులకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం గౌవర భృతి అందజేస్తుందన్నారు. అనంతరం రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ కోవూరు మండలంలో 773 విడవలూరు మండలంలో 257, కొడవలూరు మండలంలో 456 ఇందుకూరు పేట మండలంలో 613 బుచ్చి రూరల్ మరియు అర్బన్ మండలాలలో 696 కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలలో 2 వేల 795 మందికి లబ్ది చేకూరిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాకదాదాపు కోట్లతో రోడ్లను మరమ్మతు చేసి ప్రయాణాన్ని సులభం చేసిందని పాత వాహనాలపై ఉన్న గ్రీన్ ట్యాక్స్‌ను 20 వేల నుంచి 3 వేలకు తగ్గించి డ్రైవర్లకు ఉపశమనం కల్పించిందన్నారు. అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకుంటే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి డ్రైవర్ల అకౌంట్లో డబ్బులు పడుకుంటే సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లు కూటమి ప్రభుత్వ అధినేత సిఎం చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి ఇ ఓ మోహన్ రావు, ఎంపిపి తుమ్మల పార్వతి, ఏఎంసీ ఛైర్మెన్ బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, సర్పంచ్ యాకసిరి విజయమ్మ, తెలుగుదేశం పార్టీ కోవూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరు పేట, బుచ్చి మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, బెజవాడ జగదీశ్, గుత్తా శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి మరియు అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
















