శంఖవరం/కర్నూలు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కార్యవర్గ సమావేశాన్ని మంత్రాలయం మండల అధ్యక్షురాలు కమ్మరి లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా శ్రమించి మహిళా ఐక్య వేదికను మరింత బలోపేతం చేయాలని కార్యవర్గ సభ్యులను కోరారు. మంత్రాలయం మండలంలో మహిళా ఐక్య వేదిక గ్రామ కమిటీ నిర్మాణాలు చేపట్టాలని, ఆమె కమిటీ సభ్యులకు తెలిపారు. మహిళలు ఆత్మగౌరవం, హక్కులకై నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందని ఆమె అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు, వ్యతిరేకంగా మహిళలంతా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె మహిళా ఐక్య వేదిక కార్యవర్గానికి పిలుపునిచ్చారు.కమిటీ సభ్యులు నిబద్ధత కలిగి సంఘ కార్యక్రమాలను నిర్వహించేలా వారికి పలు సూచనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింధూజ, కళావతి, రేవతి, ముత్తమ్మ, గోశాల లక్ష్మీ, ఆకుల లక్ష్మీ, హనుమంతమ్మ, మహాదేవి, నాగమ్మ,బి.లక్ష్మీ,సావిత్రి,ఉప్పర అనూష,జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







