
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఆటో డ్రైవర్లతో కలిసి కూటమి నాయకులు చిత్రపటానికి మంత్రి పి నారాయణ పాలాభిషేకం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లు చేపట్టిన ర్యాలీలో మంత్రి కూడా ఆటో నడిపారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఇచ్చిందన్నారు.ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన డ్రైవర్లందరికీ ఏడాదికి 15వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా రూ. 436 కోట్లు జమ అయ్యాయి. పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు 1500 ఆటో డ్రైవర్లు కు 15000 తన అకౌంట్లో జమ అయిందని శ్రీ సందర్భంగా తెలిపారు. గత వైసీపీ ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇస్తే, కూటమి ప్రభుత్వం 50 శాతం పెంచి రూ.15 వేలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్
సగిలి షాన్ మోహన్, ఎంపీ తెంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, తుమ్మల బాబు,జ్యోతుల నవీన్,నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, బదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, మేడిశెట్టి సూర్య కిరణ్(బాబీ),కొండల సాయికుమార్, జ్యోతుల పెద్దబాబు, కూటమి నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.







