స్వచ్ఛ నారి ససక్త పరివార్ కి ప్రజలు సహకరించాలి
గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పిలుపు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
గ్రామాలలో ప్రత్యేకంగా కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానం అని ప్రతి మహిళా గుర్తుంచుకుని నిత్య జీవితం లో ముందుకు సాగాలని రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పిలుపు ఇచ్చారు. శనివారం సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ( వి హెచ్ సి) లో పాకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నన్నం వంశీధర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సింగయ్య మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా అందుబాటులో ఉండే ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ( వి హెచ్ సి) ల వైద్య సిబ్బంది సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమం గురించి, ఆరోగ్య భద్రత, సంరక్షణ పై డా.నన్నం వంశీధర్ అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ( వి హెచ్ సి) ల ద్వారా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని హితవు చెప్పారు.భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ నారి ససక్త పరివార్ కార్యక్రమాన్ని ప్రతి మహిళా సద్వి నియోగం చేసుకోవడం కోరారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం లో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు డాక్టర్ సెల్వన్,హెచ్ ఇ ఒ కల్యాణి, ఎ ఎన్ ఎం రమణమ్మ,ఎం ఎల్ హెచ్ పి శిరీష,సునీత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు వందల మందికి పైగా మహిళల రక్త పోటు, మధుమేహం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ కాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. వైద్య సేవలు అందించడం తో పాటు అవగాహన కల్పించారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆరోగ్య పరిరక్షణ జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
