మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
విచ్చలవిడిగా జరుగుచున్న మద్యం ప్రియుల చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఆప్రాంతాల వాతావరణాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరించారు. ప్రభుత్వం వేలం ద్వారా అనుమతి పోందిన మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా ఆయా దుకాణాల వద్ద బహిరంగ మధ్య పాన సేవనాన్ని అనుమతించవద్దని సున్నితంగా హెచ్చరించారు. మద్యం దుకాణాల పరిసరాల్లో విచ్చల విడిగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారని నివాస ప్రాంతాలలో ఇబ్బందిగా ఉండడం పై స్థానికులు పోలీస్ దృష్టికి తేవడం తో జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలతో పరిసరాలు శుభ్రం చేయడం లో పోలీస్ లు నిమగ్నం అయ్యారు. జె సి బి తో ఆ పరిసరాలు చదును చేశారు. శుభ్రం చేసిన ప్రదేశం లో ఎవరైనా బహిరంగ మధ్య పానం చేస్తే అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.