మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి.సుప్రియ మరియు ఎం.నిహారిక అనే విద్యార్థినులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13,14 తేదీలలో విశాఖపట్నంలోనీ ఆరిలోవాలో జరిగిన సబ్ జూనియర్ పోటీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున మంచి ప్రదర్శన ఇవ్వటం ద్వారా రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.వచ్చేనెల 26 నుండి 30 వరకు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగే జాతీయ పోటీలలో వారు పాల్గొంటారు.ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆ విద్యార్థినులను మరియు వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయినిలు ఏ.కోటేశ్వరమ్మ మరియు ఎల్.లావణ్య లను పాఠశాల ప్రధానోపాధ్యాయిని కే మహాలక్ష్మి మరియు బోధన బోధనేతర సిబ్బంది అభినందించడం జరిగింది.విద్యార్థినులు జాతీయస్థాయి పోటీలలో కూడా మంచి విజయం సాధించాలని అందరూ ఆకాంక్షించారు.