

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:-
సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ సిహెచ్. శ్రీనివాస్ రావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి డీ. జయమణి, ఏటీఎం వెలుగు ప్రతినిధులు, ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ , హౌసింగ్ ఏ ఈ, ఐ సి డి ఎస్ సూపర్వైజర్, మెడికల్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారి తదితర విభాగాల అధికారులు హాజరయ్యారు.సమీక్షలో మండల అభివృద్ధి కార్యక్రమాలు, శాఖల పనితీరు, ప్రజలకు చేరువ చేయాల్సిన సేవల అమలు వంటి అంశాలపై చర్చించారు.