

మన న్యూస్: కామారెడ్డి జిల్లా జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల వయస్సు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని జీఓ నెం.81, 85 ప్రకారం విఆర్ఎ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో 16 నెలలుగా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నామని జీఓలు ఇచ్చిన తర్వాత ఉద్యోగం రాకపోతుందా అని కొందరు, తండ్రి ఉద్యోగం కోసం అన్నదమ్ములకు ఉన్న అర ఎకరం, ఎకరం భూమిని రాసి ఇచ్చారు. అప్పులు చేసి తమ సోదరులకు లక్షల రూపాయలు వాటా క్రింద ఇచ్చారు. ఉద్యోగం రాక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆర్ధికంగా, మానసికంగా వీఆర్ఏ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. కొందరు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 280 మందికి పైగా వీఆర్ఏలు మరణించారు. ఇంకా అనేకమంది విఆర్ఎలు అనారోగ్యాలకు గురవుతున్నాము. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న
ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన కనిపించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క వారసత్వ ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరారు
