

యాదమరి ఆగస్ట్ 02 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం” 2025 – 26 మొదటి విడత నిధుల విడుదల ప్రారంభోత్సవం కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… రైతులకు అండగా నిలబడేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని, రైతుల కష్టం తీర్చేందుకు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే ధ్యేయంగా ఏడాదికి రైతులకు ఇచ్చే రూ.20 వేలులో మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. పూతలపట్టు నియోజకవర్గానికి మొత్తం రూ.23.01 కోట్లు నిధులు మంజూరు కాగా, అందులో అన్నదాత సుఖీభవ ₹16.94 కోట్లుగా, పిఎం కిసాన్ యోజనకు రూ.6.07 కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు. ఐరాల మండలంలో రూ. 4.36 కోట్లు, యాదమరి మండలంలో రూ.4.01 కోట్లు, బంగారుపాలెం మండలంకు రూ. 6.13 కోట్లు, పూతలపట్టు మండలంకు రూ.4.14 కోట్లు, తవనంపల్లి మండలం రూ.4.38 కోట్ల నిధులు కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, తవణంపల్లె మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, యాదమరి మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రబ్బీ, బంగారుపాళ్యం మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు, సింగల్ విండో ఛైర్మన్ చిత్ర నాయుడు, సింగల్ విండో డైరెక్టర్స్ మహబూబ్ బాష, ప్రభాకర్, ఏఎంసీ డైరెక్టర్స్ మోహన్, హరి ప్రసాద్(సతీష్), నాయకులు అమరనాథ్ నాయుడు, హేమయ్య, విజయేంద్ర యాదవ్, జి.యస్.కుమార్, ధరణీ, గోపి గౌడ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

