

మన న్యూస్ పాచిపెంట జులై 31:- పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట మండలంలో వరి నాట్లు వేసే ముందు కొసలు తుంచి నాటడం వలన ఆకు చివర పసుపు రంగు కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మూల వలస గ్రామంలో ఆశ్ర పర్యవేక్షకులు సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామంలో వరుసలలో వరి నాట్లపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ పసుపు రంగు కాండం తొలుచు పురుగు వరి ఆకుల చివర గుడ్లను పెడుతుందని నాట్లు వేసే ముందు చివర్లను తుంచి నాటుకుంటే ఈ పురుగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చని తెలిపారు అంతేకాకుండా వరుసలలో వరి నాటుకోవడం వలన వరుసల మధ్య గాలి వెలుతురు బాగా సోకుతుందని దీనివలన చీడపీడల ఉధృతి బాగా తగ్గుతుందని సస్యరక్షణ చర్యలు సులువుగా చేపట్టవచ్చని తెలిపారు గట్లపై కూరగాయలు కంది విత్తనాలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు గిరిజనులు సాధారణంగా తినడం కోసమే వరి పండిస్తారు కాబట్టి ఎలాంటి ఎరువులు మరియు పురుగుమందులు వాడకుండా పండించుకోవాలని అవసరమైతే ప్రకృతి వ్యవసాయం విధానాల కోసం గ్రామ వ్యవసాయ సహాయకులు చక్రవర్తిని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు పాల్గొన్నారు.
