

ఇబ్రహీంపట్నం. మన న్యూస్ :- బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ, ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ….ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను 18 నెలలలోనే అమలు చేస్తున్నామని,మిగతా పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పారు.గత ప్రభుత్వం 10 ఏండ్లు పాలించి ప్రజలకు కనీస అవసరాలైన రేషన్ కార్డులు,ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమం- అభివృద్ధి పేరుతో పేదలకు పథకాలు అందచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్ రెడ్డి,కంబాలపల్లి గురునాథ్ రెడ్డి,వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్,డైరెక్టర్స్ శ్రీశైలం యాదవ్, దొంతరామోని రాజు,ఎం ఆర్ఓ సునీత,మున్సిపల్ కమిషనర్లు సత్యనారాయణ రెడ్డి,బాలకృష్ణ, గ్రామాల కార్యదర్శులు,వార్డు అధికారులు,ఇందిరమ్మ కమిటి సభ్యులు కాంగ్రేస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
