ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు దివంగత సీఎం వైఎస్సార్

వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి

ఉరవకొండలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు

ఉరవకొండ, మన న్యూస్:ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిను ఆ పార్టీ మంగళవారం ఉరవకొండలో ఘనంగా నిర్వహించింది. ప్రధాన కూడళిలోగల దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అక్కడే కేక్ కట్చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్ ్సమెంట్, రైతు రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లాంటి పధకాలతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. జలయజ్ఞం చేపట్టి కోటి ఎకరాలకు సాగునీటిని అందించడానికి చేపట్టిన ప్రాజెక్టు ఫలాలను నేడు రైతుల అందుకొంటున్నారన్నారు. రాయలసీమను సస్యశామలం చేయడానికి చేపట్టిన హంద్రీనీవా పథకంతో నేడు లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చి సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అయిందన్నారు. వైఎస్సార్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది గుండె పగలి మరణించారంటే ఆయనకు ప్రజల గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏ.సి. పార్వతమ్మ, మేజర్ పంచాయతీ సర్పంచ్ మీనుగ లలిత, మాజీ ఎంపీపీ చందా చంద్రమ్మ, మహిళా విభాగం మండల అధ్యక్షులు వసంతమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, రూరల్ మండల అధ్యక్షులు రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి, సమన్వయకర్త మూలగిరిపల్లి ఓబన్న, మాజీ జెడ్పీటీసీ ఎస్. తిప్పయ్య, నాయకులు ఎం.బసవరాజు, కె. గోవిందు, ఈశ్వర్, వెలిగొండ శివ, శ్రీరాములు, బుదగవి ధనుంజయ, అంగదాల అంజి, మల్లికార్జున, పచ్చిరవి, చిన్న భీమ, వేమన్న, నిమ్మల రమణ, వడ్డే ఆంజినేయులు, కమ్మటి రామాంజినేయులు, ఓబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులకు పలకలు పంపిణీ…సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతా…రూరల్ మండలాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి రూరల్ :- విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు మూలం చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో…

అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

మన న్యూస్ తవణంపల్లి జూలై-11 తవణంపల్లి మండలం అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ, ప్రత్యేక పూజలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విద్యార్థులకు పలకలు పంపిణీ…సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతా…రూరల్ మండలాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి…

విద్యార్థులకు పలకలు పంపిణీ…సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతా…రూరల్ మండలాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి…

అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి కనుమరుగయ్యే పరిస్థితి..టిడిపి నగర అధ్యక్షులువట్టికుంట చినబాబు

రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి కనుమరుగయ్యే పరిస్థితి..టిడిపి నగర అధ్యక్షులువట్టికుంట చినబాబు

అమర రాజా విద్యాలయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

అమర రాజా విద్యాలయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

శాకాంబరిదేవి అమ్మవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

శాకాంబరిదేవి అమ్మవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

కూటమి ప్రభుత్వ సూపరిపాలనతో పల్లె ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి..ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షతను ప్రజలు మెచ్చుకుంటున్నారు

కూటమి ప్రభుత్వ సూపరిపాలనతో పల్లె ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి..ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షతను ప్రజలు మెచ్చుకుంటున్నారు