

మన న్యూస్,తిరుపతి :;- పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసిపి పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు చెప్పారు. గురువారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చినబాబు మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో తోతాపురి మామిడికాయలను కిలో 16 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని జగన్ రెడ్డి చెప్పడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆ రాష్ట్రంలో తోతాపూరి పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేసే దిక్కు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు లేఖ రాశారని గుర్తు చేశారు. గత మూడు నెలల గురించి ఏనాడు రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు ఉన్నట్లు ఉండి రైతుల మీద ప్రేమ ఓలకపొస్తున్నట్లు నటించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పలనాడు పర్యటనలో జగన్ రెడ్డి సింగయ్యను కారుతో తొక్కించి చంపిన ఘటన ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. బంగారుపాలెం మండలంలో జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా అదే పార్టీకి చెందిన ఓ రైతుకు చెందిన మామిడికాయలను రోడ్లమీద పోయించి ధరలు లేక రైతులు రోడ్లమీద పోశారని బూటకపు నాటకాలు ప్రజలందరూ తెలుసుకున్నారు అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో విధ్వంశాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, అలాంటి కుట్రలను తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని పేర్కొన్నారు. జగన్ రెడ్డి పర్యటన దండయాత్రకు బల నిరూపణకు వచ్చినట్లే ఉంది గాని రైతులకు పరామర్శించడానికి వచ్చినట్లు ఏ కోశానా కనపడలేదన్నారు. జగన్ రెడ్డి పర్యటనకు ముందే స్థానికంగా ఉన్న జిల్లా నాయకులు రైతులతో మాట్లాడి అవగాహనతో వచ్చి ఉండాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా న్యాయబద్ధంగానే ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేశామే కానీ, ఏనాడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదన్నారు. పలు అవినీతి, అక్రమస్తుల 11 కేసులలో ముద్దాయిగా ఉన్నాడని త్వరలో జైలుకుపోవడం ఖాయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని జోష్యం చెప్పారు. బంగారుపాళ్యం పర్యటనలో ఓ మీడియా ప్రతినిధి పై వైసీపీ నేతలు దాడులు చేయడం పై వెంటనే గాయపడిన ఫోటోగ్రాఫర్ శివ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి తగు న్యాయం చేయాలని వట్టికుంట చిన్నబాబు డిమాండ్ చేశారు.