

మన న్యూస్ తవణంపల్లి జూలై-11 తవణంపల్లి మండలం అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ, ప్రత్యేక పూజలు సాయంత్రం నుండి ప్రాకారోత్సవం జరిగింది. మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, భజనలు నాటకాలు జరిగింది. చుట్టుపక్కల తమిళనాడు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని పూజ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో హనుమంత్ భక్తులు అర్చకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

