వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి

ఉరవకొండలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు

ఉరవకొండ, మన న్యూస్:ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిరస్మరణీయులని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిను ఆ పార్టీ మంగళవారం ఉరవకొండలో ఘనంగా నిర్వహించింది. ప్రధాన కూడళిలోగల దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అక్కడే కేక్ కట్చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్ ్సమెంట్, రైతు రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లాంటి పధకాలతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. జలయజ్ఞం చేపట్టి కోటి ఎకరాలకు సాగునీటిని అందించడానికి చేపట్టిన ప్రాజెక్టు ఫలాలను నేడు రైతుల అందుకొంటున్నారన్నారు. రాయలసీమను సస్యశామలం చేయడానికి చేపట్టిన హంద్రీనీవా పథకంతో నేడు లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చి సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అయిందన్నారు. వైఎస్సార్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది గుండె పగలి మరణించారంటే ఆయనకు ప్రజల గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏ.సి. పార్వతమ్మ, మేజర్ పంచాయతీ సర్పంచ్ మీనుగ లలిత, మాజీ ఎంపీపీ చందా చంద్రమ్మ, మహిళా విభాగం మండల అధ్యక్షులు వసంతమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, రూరల్ మండల అధ్యక్షులు రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి, సమన్వయకర్త మూలగిరిపల్లి ఓబన్న, మాజీ జెడ్పీటీసీ ఎస్. తిప్పయ్య, నాయకులు ఎం.బసవరాజు, కె. గోవిందు, ఈశ్వర్, వెలిగొండ శివ, శ్రీరాములు, బుదగవి ధనుంజయ, అంగదాల అంజి, మల్లికార్జున, పచ్చిరవి, చిన్న భీమ, వేమన్న, నిమ్మల రమణ, వడ్డే ఆంజినేయులు, కమ్మటి రామాంజినేయులు, ఓబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *