

కొండాపురం,,మనన్యూస్ : కొండాపురం మండలం సాయి పేట గ్రామానికి చెందిన బృగుమల మహేష్ ఇటీవల విద్యుత్ ఘాతుకంతో షాక్ కు గురై రెండు చేతులు కాళ్లు, చచ్చుబడిపోయి, మంచానికి పరిమితమై చికిత్స పొందుతున్నారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ బాధితుడు నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. పార్లపల్లి సచివాలయం పరిధిలో లైన్మెన్ గా పనిచేస్తున్న మహేష్ కు ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం అవసరాల నిమిత్తం శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధితుడికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పిటిసి సభ్యులు దామా మహేష్ రావు, పి . చంద్రబాబు నాయుడు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.