శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) ఆధ్వర్యంలో శంఖవరం మండలం కత్తిపూడి 10 వ వార్డ్ లో టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, బద్ది రామారావు టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి, ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. ప్రజాప్రతినిధులు కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు, సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా టిడిపి నేత వెన్న శివ మాట్లాడుతూ, కూటమి పాలనపట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఐదేళ్ల పాలనలో జగన్‌ దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు.అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ మాట్లాడుతూ,మహిళలు వృద్ధులతో మాట్లాడి సంక్షేమ పథకాలు, పింఛన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 80 శాతం నెరవేర్చినట్లు చెప్పారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో దురదృష్టకర పాలనను చూశామని ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిపై దాడులకు దిగారని విమర్శించారు. విద్యంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో దశల వారీ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి పాలనలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తోందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాధాన్యత ప్రకారం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కీర్తి సుభాష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు సాధనాల లక్ష్మి బాబు, కంచిబోయిన శ్రీను, తదితర టిడిపి శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *