మన న్యూస్ సింగరాయకొండ:-

నిన్న ది:17-06-2025 న సింగరాయకొండ Dr. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంగణం వద్ద మాదిగ మహా మేళా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తో ఎస్సీ వర్గీకరణను సాధించుకొని, ఆ ఫలాలను అన్ని ఉప కులాల వారికి అందించడంతో పాటు, ఈ సమాజానికి ఒక ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన ఏకైక ఉద్యమ సంస్థ ఎమ్మార్పీఎస్ అని, ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితం ఏ ఒక్కరి సొత్తు కాదని, వేలాదిమంది మాదిగల త్యాగఫలితంగానే వర్గీకరణ సాధించామని తెలిపారు. జులై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వం లో ఒంగోలు లోని మున్సిపల్ ఆడిటోరియం గ్రౌండ్ లో 31 సంవత్సరాల లోనికి అడుగు పెడుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆధ్వర్యంలో వర్గీకరణ చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు అధిక సంఖ్యలో సింగరాయకొండ మండల మాదిగలు అందరూ జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ పిలుపు మేరకు మాదిగలు హాజరై సభ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *