నెల్లూరులో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ విద్యార్థివిద్యార్థినులకు 2024- 25 ప్రతిభ ప్రోత్సాహ బహుమతులు.

మన న్యూస్, నెల్లూరు, జూన్ 1: నెల్లూరు గొలగమూడి రోడ్డు ,కొండపాళెంలో ఉన్న జిల్లా యాదవ భవన్లో ఆదివారం ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ విద్యార్థివిద్యార్థినిలకు 2024 -25 ప్రతిభ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు పాల్గొన్నారు.ముందుగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ….యాదవ ఎంప్లాయిస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ విద్యార్థివిద్యార్థినులకు ప్రతిభ ప్రోత్సాహక పురస్కారాలు 2024 -25 రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. పదవ తరగతి ,ఇంటర్ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు వలన వారిలో నూతన ఉత్సాహం , పోటీతత్వం కలుగ చేస్తుంది అని అన్నారు .విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అని అన్నారు. యాదవ విద్యార్థులకే కాక ఇతర సామాజిక వర్గ విద్యార్థులు కూడా ప్రతిభ పురస్కారాలు అందజేయడం చాలా అభినందనీయం అని తెలియజేశారు.రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మాట్లాడుతూ …….. యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో 2008 నుండి ప్రతి సంవత్సరం క్రమ తప్పకుండా యాదవ విద్యార్థివిద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పురస్కారాలు బహుమతులు అందజేస్తున్నారు అని అన్నారు.ఈ ప్రతిభ పురస్కారాలు వల్ల విద్యార్థుల్లో నూతన ఉత్సాహం,పోటీ తత్వం పెరిగే విధంగా ఈ ప్రోత్సాహ బహుమతులు తోడ్పడతాయని అన్నారు.ఈ సంస్థకు నా వంతు సహాయ సహకార అందజేస్తున్నానని అని తెలియజేశారు .విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులు విద్యుతోపాటు క్రమశిక్షణ, ఆరోగ్యం, లక్ష్యం ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు , గురువు లకు జన్మభూమికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.అనంతరం కొలుసు పార్థసారథి, బీద మస్తాన్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా మాదాల వెంకటేశ్వర్లు యాదవ్, పి. చెంచల బాబు యాదవ్ ,బొమ్మి నాగ కిషోర్ యాదవ్, గంగుల మధుసూదన్ యాదవ్ ,ఉడత శ్రీనివాస్ యాదవ్, చుక్కా కొండ యాదవ్, దూడల సుధాకర్ యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్, ఓ. కృష్ణారావు, గోచి మదు సూధన్ యాదవ్, బొమ్మి రాధయ్య యాదవ్, మాదాల రాజేష్ యాదవ్ ,పెరుమాళ్ కొండయ్య యాదవ్ ,గుర్రం నాగేశ్వరావు యాదవ్, పద్మజ యాదవ్ , బొమ్మి సురేంద్ర యాదవ్ దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ ,విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి మంచి భోజనం ఏర్పాట్లు చేశారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..