గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్

మన న్యూస్,కందుకూరు,ఏప్రిల్ 28: :- గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం కూనం రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరగా.. వారికి పార్టీ కండువాలు వేసి నేతలు ఆహ్వానించారు. గ్రామానికి చేరుకున్న నేతలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో 50 లక్షలతో నిర్మించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు.. బిందెకు నీళ్లు పట్టి మహిళలకు అందించారు. అనంతరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 18 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు వేదికపై కూనం రాఘవరెడ్డి, ఆయన అనుచరవర్గం దాదాపు 500 మంది మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి నేతలు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ…… ఉలవపాడు మండలంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. బద్దిపూడి గ్రామంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ తో నీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. గ్రామాల్లో నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగి అభివృద్ది చేసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలన మెచ్చి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాలు అధ్వానంగా ఉండేవని, ఇప్పుడు ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఈ గ్రామానికి వచ్చామని, తమకు ఎంతో మద్దతు ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. తప్పకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ… ప్రజలు నీటి సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారని, కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్నడు లేని విధంగా మండలంలోని ప్రతి గ్రామానికి శాశ్వత మంచినీటి వసతి కల్పిస్తున్నారన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. బద్దిపూడిలో ఇక వైసీపీ లేదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ….. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాయకులు తమ వెంట నడిచారని గుర్తు చేశారు. అలాగే తాము అడిగిన వెంటనే సబ్‌ స్టేషన్లను కేటాయించి కరెంట్‌ సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, స్థానిక నాయకులు బ్రహ్మానంద రెడ్డి, చేజర్ల వెంకట్రామిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీనివాసులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • సమన్వయంతో పనిచేస్తేనే గ్రామస్వరాజ్యం
  • బద్దిపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
  • వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 500 మంది
  • పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///