

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు జిల్లావ్యాప్తంగా వందలాదిమంది దివ్యాంగులను ఆదుకుంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. మరో 6 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించి ఆదుకున్నారు. సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. నడవలేక అవస్థలు పడే ఏ ఒక్క దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందకుండా ఉండకూడదన్నది ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష్యం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల వ్యాప్తంగా ట్రై సైకిళ్లు అందిస్తున్నారు. అనివార్య కారణాలతో ట్రై సైకిళ్ళు ఆదుకోలేకపోయిన కావలి పట్టణంలోని బుడంగుంట అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు, సోమశిల, సంగం మండలం తరుణవాయి గ్రామాలకు చెందిన 6 మంది దివ్యాంగులు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ళు అందుకున్నారు. ట్రై సైకిళ్ళు అందుకున్న దివ్యాంగులు ఎంపి వేమిరెడ్డి దాతృత్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.
