

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా విద్యార్థిగద్వాల జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎన్‌ఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలో జోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన విద్యార్ధి అక్షర సత్తా చాటింది.ఉత్తమ ర్యాంకుతో ప్రతిభ చూపింది.గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన రామ్ మోహన్ రెడ్డి,సంధ్య దంపతుల కుమార్తె అక్షర జేఈఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరి ఆలిండియా స్థాయిలో 100కు 99.90 శాతం మార్కులతో 1646 ర్యాంకు సాధించింది.మరియు ఈడబ్ల్యూఎస్ క్యాటగిరి ఆలిండియా స్థాయిలో 135 ర్యాంకు సాధించి ఐఐటి అడ్వాన్స్ కు అర్హత పొందింది. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో విద్యార్థి మరెన్నో ఉన్నత స్థానానికి వెళ్లాలని స్థానికులు కోరుకుంటూ, హర్షం వ్యక్తం చేస్తున్నారు.